మాట్లాడే ఓవెన్‌! | Owen in innovative style | Sakshi
Sakshi News home page

మాట్లాడే ఓవెన్‌!

Jun 2 2018 2:33 AM | Updated on Jun 2 2018 7:48 AM

Owen in innovative style - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ఈ రోజుల్లో ఓవెన్‌ అనేది ప్రతి ఇంట్లోనూ కామన్‌ అయిపోయింది. కానీ, ఓవెన్‌ ఎంత స్పెషాలిటీ అనేదే ఇక్కడ మ్యాటర్‌. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో సాధారణ ఓవెన్‌లకు కాలం చెల్లింది. ప్రముఖ కంపెనీలు వినూత్న తరహాలోలో ఓవెన్‌లను తయారుచేస్తున్నాయి. బజాజ్, శామ్‌సంగ్, కెన్‌స్టార్, ఎల్జీ వంటి రకరకాల బ్రాండెడ్‌ కంపెనీలు ఓవెన్లను అందిస్తున్నాయి. వీటి ధరలు రూ.5–40 వేల వరకున్నాయి.

బేసిక్‌ టైప్, గ్రిల్‌తో కూడిన ఓవెన్, కన్వెన్షన్‌ వంటి మూడు రకాల ఓవెన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.  
 రీ హీట్‌ కోసమైతే బేసిక్‌ ఓవెన్‌ ఉత్తమం. బేకింగ్, గ్రిల్లింగ్‌ పదార్థాలను ఎక్కువగా వండుతున్నట్లయితే మైక్రోవేవ్‌ విత్‌ గ్రిల్‌ కొనడం మంచిది.
 మెకానికల్‌ కంట్రోల్‌గా పనిచేసేవైతే సాధారణ గృహిణులు వాడేందుకు వీలుగా ఉంటాయి. ఎక్కువగా వాడినా.. రఫ్‌గా వినియోగించినా ఇబ్బంది ఉండదు.
 సింగిల్‌ టచ్‌ రోటరీ ప్యానల్‌ కూడా మెకానికల్‌ కంట్రోల్స్‌ని పోలి ఉంటుంది. కాకపోతే వాడుతున్నప్పుడు ఇది కాస్త సున్నితంగా అనిపిస్తుంది.
ఎలక్ట్రానిక్‌ ప్యానల్‌ ఉన్న ఓవెన్‌లో విద్యుత్‌ స్థాయిలను కూడా సూచిస్తుంటుంది.
 అంధులు, కంటి చూపు సమస్య ఉన్నవారూ టాక్‌టైల్‌ కంట్రోల్‌ ఓవెన్‌లు ఎంతో సహాయపడతాయి.
 చిన్నపిల్లలున్న ఇంట్లో చైల్డ్‌ సేఫ్టీ లాక్, ఎలక్ట్రానిక్‌ లాక్‌ ఉన్న ఓవెన్లను తీసుకోవడం ఉత్తమం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement