చల్‌ 'వాహన' రంగ

 new features that are brand new models - Sakshi

కొత్త ఏడాది ట్రాక్‌పైకి దూకనున్న కార్లు

ధరలు రూ.3.5 లక్షల నుంచి రూ. 25 లక్షలపైనే

కొత్త మోడళ్లతో పాటూ కొత్త ఫీచర్లతో వేరియంట్లు

ఆటో ఎక్స్‌పోలో 25 నుంచి 30 కార్ల ఆవిష్కరణ  

కారు.. ఇపుడు రోటీ, కపడా ఔర్‌ మకాన్‌ సరసన చేరిపోతోంది. పట్టణ, నగరవాసులకైతే... చేరిపోయిందనే చెప్పాలి!!. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి సరదాగానో.. అవసరానికో ఎక్కడికైనా వెళ్లాలంటే కారు కావాలి మరి. మారుతున్న పరిస్థితులు, కొత్తరూపు సంతరించుకుంటున్న జీవన స్థితిగతులు, పెరుగుతున్న ఆదాయాలు, వినియోగదార్లను కార్లవైపు పరుగులు తీయిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వాహన సంస్థలు కూడా అందిపుచ్చుకుంటున్నాయి. కొత్త మోడళ్లతో.. లగ్జరీ లుక్‌తో.. ఒకదానిపై మరొకటి పైచేయి సాధించే సరికొత్త వ్యూహాలతో దూసుకొస్తున్నాయ్‌. వాహన సంస్థలు తమ సత్తా చూపేందుకు, మార్కెట్లో పోటీపడేందుకు వేదికగా నిలుస్తోంది ఆటో ఎక్స్‌పో. ఈసారి గ్రేటర్‌ నోయిడా కేంద్రంగా వచ్చే ఫిబ్రవరిలో 9–14 మధ్య వెలుగులు విరజిమ్మే ఈ వాహన ప్రదర్శనలో 25–30 ఆవిష్కరణలు చోటు చేసుకోనున్నాయి. ఆయా కార్ల వివరాలే ఈ ప్రత్యేక కథనం... – సాక్షి, బిజినెస్‌ విభాగం

రెనో క్విడ్‌ రేసర్‌..
బడ్జెట్‌ కార్ల సెగ్మెంట్లో అధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో రెనో క్విడ్‌ ఒకటి.  క్విడ్‌లో ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త వేరియంట్‌ను రెనో కంపెనీ తెస్తోందంటే.. ఈ మోడల్‌ ఎంతగా పాపులర్‌ అయిందో అర్థమవుతోంది. క్విడ్‌ రెగ్యులర్‌ మోడల్‌లో స్పోర్టియర్‌ వెర్షన్‌గా క్విడ్‌ రేసర్‌ను రెనో కంపెనీ అందుబాటులోకి తెస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి. రూ.5 లక్షల ఖరీదుండే కార్ల సెగ్మెంట్లో  అత్యంత ఆసక్తిని రేకెత్తించే మోడల్‌ ఇది. 

మళ్లీ హ్యుందాయ్‌ శాంత్రో..
రూ.4 లక్షలు–6 లక్షల రేంజ్‌లో

రోడ్ల మీద దూసుకెళ్లనుంది. 15 ఏళ్ల విక్రయాల అనంతరం ఈ మోడల్‌ను భారత మార్కెట్‌ నుంచి హ్యుందాయ్‌ ఉపసంహరించింది. అత్యంత స్టైల్‌గా, స్పోర్ట్స్‌ కారు లుక్‌తో శాంత్రో కారును హ్యుందాయ్‌ డిజైన్‌ చేస్తోంది. ఆటోమేటిక్‌ వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తేనున్నది. హ్యుందాయ్‌ ఆఫర్‌ చేయనున్న తొలి ఏఎంటీ వెర్షన్‌ కారు బహుశా ఇదే కానున్నది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనలో తీసుకొచ్చి మార్కెట్లోకి మాత్రం దసరా, దీపావళి కల్లా తీసుకురానున్నట్లు సమాచారం. 

విటారా బ్రెజా.. (పెట్రోల్‌ వెర్షన్‌)
రూ.7 లక్షలు–10 లక్షలు 

మారుతీ సుజుకీ మోడళ్లలో టాప్‌ మోడల్, అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో విటారా బ్రెజా  ఒకటి. ఈ  కాంపాక్ట్‌ ఎస్‌యూవీ డీజిల్‌ వేరియంట్‌కు అనూహ్యమైన స్పందన లభించడమే కాకుండా దీంట్లో పెట్రోల్‌  వేరియంట్‌ కావాలన్న డిమాండ్‌ బాగా పెరుగుతోంది. అందుకని ఈ మోడల్‌లో పెట్రోల్‌ వేరియంట్‌ను మారుతీ సుజుకీ తేనుంది. డీజిల్‌ మోడల్‌లో ఉండే విధంగానే డిజైన్, ఇతరత్రా ఫీచర్లు ఉంటాయి. 

మారుతీ సుజుకీ జిమ్ని 
రూ.5.70 లక్షలు–రూ.7 లక్షల రేంజ్‌లో

సుజుకీ తెస్తోంది. ఈ కారును భారత్‌లో తయారు చేసి ఆగ్నేయాసియా, యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీ కొండలు, గుట్టలు, ఎడారులు వంటి ఆఫ్‌–రోడ్‌ ప్రయాణ ఔత్సాహికులను ఆకట్టుకోగలదని కంపెనీ ఆశిస్తోంది. పెద్ద బంపర్, పెద్ద పెద్ద హెడ్‌ల్యాంప్స్‌ వంటి ఫీచర్లు ఆకర్షణీయ అంశాలు. 

నిస్సాన్‌ కిక్స్‌
రూ.10 లక్షలు–రూ.15 లక్షలు

ఎస్‌యూవీ కిక్స్‌ను భారత మార్కెట్లోకి నిస్సాన్‌ కంపెనీ తేనున్నది. భారత్‌లో  ఎస్‌యూవీలు బాగా అమ్ముడవుతున్న నేపథ్యంలో ఈ నిస్సాన్‌ కిక్స్‌ మంచి విక్రయాలు సాధించగలదని కంపెనీ ఆశిస్తోంది. ఆటో ఎక్స్‌పోలో ఈ కారును ఆవిష్కరించవచ్చు. హ్యుందాయ్‌ క్రెటాకు గట్టిపోటీనిస్తుందన్న అంచనాలున్నాయి. మల్టీ ఫంక్షనల్‌ స్టీరింగ్‌ వీల్, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లున్నాయి. పెట్రోల్, డీజిల్‌ రెండు వేరియంట్లలోనూ లభ్యం కావచ్చు.

టాటా క్యూ501
రూ.16 లక్షలు–25 లక్షల రేంజ్‌లో

ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ ప్లాట్‌ఫార్మ్‌పై టాటా మోటార్స్‌ తయారు చేస్తోన్న ప్రీమియమ్‌ ఎస్‌యూవీ ఇది. నెక్ట్స్‌ జనరేషన్‌ టాటా సఫారీ స్టార్మ్‌ కూడా ఇదే. జీప్‌ కంపాస్, హ్యుందాయ్‌ ట్యూసన్‌ ఎస్‌యూవీలకు ఈ ఏడు సీట్ల ఎస్‌యూవీ గట్టి పోటీనివ్వగలదని అంచనా. 2.0 లీటర్‌ ఇంజిన్‌తో రూపొందే ఈ 4వీల్‌ డ్రైవ్‌  ఎస్‌యూవీని వచ్చే ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్యన కంపెనీ మార్కెట్లోకి తేవచ్చు. 

మహీంద్రా యూ321
రూ.12 లక్షలు–18 లక్షలు 

జైలో ఎంపీవీ(మల్టీ పర్పస్‌ వెహికల్‌) స్థానంలో మహీంద్రా కంపెనీ తెస్తున్న ప్రీమియమ్‌ ఎంపీవీ ఇది. టయోటా ఇన్నోవా క్రిస్టకు గట్టి పోటీనివ్వగలదని అంచనాలున్నాయి. ఉత్తర అమెరికా టెక్నికల్‌ సెంటర్‌లో డిజైన్‌ చేసిన ఈ ఎంపీవీని నాసిక్‌ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్, పెద్దదైన విండ్‌స్క్రీన్, స్ప్లిట్‌ రేడియేటర్‌ ఎయిర్‌–ఇన్‌లెట్స్‌ వంటి ఫీచర్లున్నాయి. ఆటోమేటిక్‌ వేరియంట్‌ వెర్షన్‌ కూడా లభిస్తుంది.  1.99 లీటర్‌ ఎమ్‌హాక్‌ డీజిల్‌ ఇంజిన్‌తో రూపొందే ఈ మోడల్‌లో ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్, రియర్‌ ఏసీ వెంట్స్, టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, 5–స్పీడ్‌ మాన్యువల్, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ తదితర ఫీచర్లున్నాయి. 

డాట్సన్‌ గో క్రాస్‌
రూ.5–10 లక్షలు

ఫోర్డ్‌ ఇకోస్పోర్ట్, మారుతీ విటారా బ్రెజాలకు పోటీగా రెనో–నిస్సాన్‌ ద్వయం తెస్తున్న మోడల్‌  ఇది. భారత్‌లోనే తయారైన విడిభాగాలను అధికంగా వినియోగించుకోవడం వల్ల ధరను ఆకర్షణీయంగా నిర్ణయించే అవకాశం ఉంది. 5, 7 సీట్ల  పెట్రోల్, డీజిల్‌ .వేరియంట్లలో ఈ కార్లు లభ్యమవుతాయి. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ ఫాగ్‌లైట్స్‌ తదితర ఫీచర్లున్నాయి. ఇంటీరియర్‌ ఫీచర్లు వెల్లడి కానప్పటికీ, గోప్లస్‌ ఎంపీవీ ఫీచర్లు దాదాపు ఉండొచ్చు. 

టాటా ఎక్స్‌451
రూ.5 లక్షలు–8 లక్షలు 

వివిధ సెగ్మెంట్లలో కొత్త మోడళ్లను తెస్తోంది. ప్రీమియమ్‌ హ్యాచ్‌బాక్‌ సెగ్మెంట్లోకి ఈ మోడల్‌తో ప్రవేశిస్తోంది. ఆటో ఎక్స్‌పోలో ఈ కారును కంపెనీ డిస్‌ప్లే చేసే అవకాశాలున్నాయి. టాటా మోటార్స్‌కు చెందిన మూడు డిజైన్‌ స్టూడియోలు, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ సంయుక్త సహకారంతో ఈ కారును డిజైన్‌ చేస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాలేదు. ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్, త్వరలో మార్కెట్లోకి వచ్చే నెక్సాన్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీలో ఉండే ఫీచర్లు కొన్ని ఈ కారులో ఉండవచ్చు. 

మారుతీ.. మరో చిన్న కారు 
రూ.3.5 లక్షలు–రూ.5 లక్షలు

మారుతీ నుంచి మరో చిన్న కారు ఆవిష్కరణ జరగనుంది. రెనో క్విడ్‌కు పోటీగా దీన్ని విపణిలోకి తీసుకురానున్నట్లు సమాచారం. వివరాలను కంపెనీ గోప్యంగా ఉంచుతోంది. ఎస్‌యూవీల్లో ఉండే ఫీచర్లతో  ఈ కారును మారుతీ రూపొందిస్తోందని సమాచారం. 1.0 లీటర్‌ కె సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో తయారయ్యే ఈ మోడల్‌లో ఆటోమేటిక్‌ వేరియంట్‌ కూడా అందుబాటులోకి రానున్నది. 2018లో గానీ, 2019లో గానీ మార్కెట్లోకి రావచ్చు.

ఈ మోడళ్లలో కొత్త వేరియంట్లు 
కొత్త మోడళ్లే కాకుండా పలు కంపెనీలు ప్రస్తుతమున్న మోడళ్లలో కొత్త కొత్త ఫీచర్లతో వేరియంట్లను అందించనున్నాయి. 

హోండా సీఆర్‌వీ ∙హోండా సివిక్‌ 
హోండా అమేజ్‌ ∙ హోండా  బ్రియో
హోండా జాజ్‌  ∙మారుతీ  స్విఫ్ట్‌ 
మారుతీ ఎర్టిగ  ∙ మారుతీ సియాజ్‌ 
హ్యుందాయ్‌  క్రెటా ∙హ్యుందాయ్‌
ఇలీట్‌ ఐ20  ∙నిస్సాన్‌ మైక్రా ∙ఫోక్స్‌వ్యాగన్‌
పోలో ∙ మహీంద్రా కేయూవీ 100 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top