దిగజారిన సీఎఫ్‌వోల ఆశావాదం | Sakshi
Sakshi News home page

దిగజారిన సీఎఫ్‌వోల ఆశావాదం

Published Wed, Nov 14 2018 2:49 AM

More pain seen in NBFC sector in next few months - Sakshi

ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఎదుర్కొంటున్న నిధుల లభ్యత సమస్య, వడ్డీ రేట్ల పెరుగుదల వంటి అంశాల కారణంగా దేశంలో కంపెనీల చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్ల (సీఎఫ్‌వో) ఆశావాదం 19 త్రైమాసికాల కనిష్ట స్థాయికి దిగజారింది.

దేశంలో అన్ని రంగాలకు చెందిన 300 మంది సీఎఫ్‌వోల నుంచి వారి కంపెనీల ఆరోగ్య స్థితి, వ్యాపార రిస్క్‌ పరిస్థితులు, స్థూల ఆర్థిక పరిస్థితులపై అభిప్రాయాలను డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ సంస్థ సర్వేలో భాగంగా తెలుసుకుంది. సీఎఫ్‌వోల ఆశావాద సూచీ సెప్టెంబర్‌ త్రైమాసికంలో 17 శాతం తగ్గి 90.2కు చేరింది. నిధుల లభ్యత తగ్గొచ్చని లేదా ప్రస్తుత స్థాయిలోనే ఉండొచ్చన్న అభిప్రాయాన్ని 72 శాతం మంది సీఎఫ్‌వోలు తెలియజేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement