బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలతో గురువారం స్టాక్ మార్కెట్లో స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Apr 13 2017 9:49 AM | Updated on Sep 5 2017 8:41 AM
ముంబై : బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలతో గురువారం స్టాక్ మార్కెట్లో స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 63.65 పాయింట్ల నష్టంలో 29,579 వద్ద, నిఫ్టీ 22.40 పాయింట్ల నష్టంలో 9181 వద్ద ట్రేడవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, గెయిల్, ఇండియాబుల్స్ హౌసింగ్, అరబిందో ఫార్మా టాప్ గెయినర్లుగా లాభాలు పండిస్తుండగా.. అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టోబ్రో, టాటా మోటార్స్, హిందాల్కో నష్టాలు గడిస్తున్నాయి.
ప్రారంభ ట్రేడింగ్ సమయంలో ఇన్ఫోసిస్ ఫలితాలు ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 2.35 శాతం నష్టాల్లో 947.90 వద్ద కంపెనీ షేర్లు నడుస్తున్నాయి. నేడు ప్రకటించిన నాలుగో త్రైమాసికంలో ఇన్ఫీ లాభాలు 3 శాతం పడిపోయి రూ.3603 కోట్లగా నమోదయ్యాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 24 పైసల లాభంతో 64.44 వద్ద ప్రారంభమైంది.
Advertisement
Advertisement