యస్ బ్యాంక్‌పై ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ కన్ను! | L&T Finance Holdings in talks to buy YES Bank: Sources | Sakshi
Sakshi News home page

యస్ బ్యాంక్‌పై ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ కన్ను!

Apr 23 2014 2:25 AM | Updated on Sep 2 2017 6:23 AM

యస్ బ్యాంక్‌పై ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ కన్ను!

యస్ బ్యాంక్‌పై ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ కన్ను!

ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. యస్ బ్యాంకులో ప్రమోటర్లకుగల

 ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. యస్ బ్యాంకులో ప్రమోటర్లకుగల 25.55% వాటాను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు వీలుగా బ్యాంకు ప్రమోటర్లు రాణా కపూర్, మధు కపూర్‌లతో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ యాజమాన్యం చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. ఇందుకు అనుమతుల విషయమై రిజర్వ్ బ్యాంక్‌ను సైతం ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. యస్ బ్యాంకులో రాణా కపూర్‌కు 5.5%, మధు కపూర్‌కు 9.7% చొప్పున వాటా ఉంది. కాగా, బ్యాంకింగ్ లెసైన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌కు అవకాశం లభించని సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement