కుంభ్‌ జియో ఫోన్‌ : ఆఫర్లేంటంటే..

Kumbh Jio Phone with unlimited free services on Kumbh Mela 2019 launched - Sakshi

సాక్షి, ముంబై: 2019 కుంభమేళాకు హాజరయ్యే భక్తుల కోసం టెలికం రంగ సంచలనం రిలయన్స్‌ జియో  మరో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.  భక్తుల  సౌకర్యార్థం ఒక స్పెషల్‌ జియోఫోన్‌ను లాంచ్‌ చేసింది. తద్వారా  జనవరి 15 నుంచి మార్చి 4 వరకు  కొనసాగే  ప్రపంచ అతిపెద్ద ఉత్సవానికి హాజరయ్యే130 మిలియన్లమందికి పైగా భక్తులకు  విశేష సేవలందించేందుకు సిద్ధమైంది. కుంభ మేళా, ముఖ్యమైన ఫోన్‌ నంబర్లు, ప్రభుత్వ సంబంధిత సేవలు వంటి వివిధ సమాచారాన్ని డిజిటల్ సొల్యూషన్స్ అందించడానికి  కుంబ్ జియో ఫోన్‌ను తీసుకొచ్చింది.1991 హెల్ప్‌లైన్‌ ద్వారా  సహాయంతోపాటు, ఉచిత వాయిస్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌ సేవలను అందించన్నుట్టు జియో  ప్రకటించింది. తమ కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ‘ఫ్యామిలీ లొకేటర్‌’ పేరుతో  ఒక యాప్‌ను అందిస్తోంది. తప్పిపోయిన  కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు యూపీ పోలీసులు, కాష్‌ ఐటీ సంస్థ సహకారంతో ఏర్పాట్లు చేసినట్లు  జియో తెలిపింది.    

అలహాబాద్‌ కుంభమేళా సందర్భంగా యాత్రీకులకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా  కుంభ్‌ జియో ఫోన్‌ను ఆ విష్కరించింది. ఇందులో కుంభమేళాకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి.  ఈ సదుపాయాలను జియో పాత, కొత్త కస్టమర్లు వినియోగించుకోవచ్చు. ఈ కుంభ్‌ జియో ఫోన్‌  ద్వారా కుంభమేళాకు సంబంధించి ముఖ్యమైన వార్తల సమాచారం, ప్రకటనలు ఎప్పటికప్పుడు పొందవచ్చు. అలాగే కుంభ్‌ రేడియో ద్వారా 24x7  భజనలు, ఇతరభక్తి  సంగీతాన్ని వినే అవకాశాన్ని  కూడా కల్పించింది.  కుంభమేళా ప్రదేశం రూట్‌మ్యాప్‌తో పాటు బస్సు, రైల్వే స్టేషన్ సమీపంలోని వసతి సదుపాయాలు , ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నెంబర్లు  అందుబాటులో ఉంటాయి. ఇంకా పూజలు, పవిత్ర స్నానాలకు సంబంధిత సమాచారాన్ని కూడా ఎప్పటికపుడు  అందిస్తుంది.  ఇతర ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.

కుంభ్‌ జియో ఫోన్‌ ఫీచర్లు
1991 హెల్ప్‌లైన్‌  నంబరు  ద్వారా ప్రత్యేక సేవలు
కుంభమేళాకు సంబంధించిన పూర్తి సమాచారం
ప్రత్యేక బస్సులు, రైళ్లకు సంబంధించిన వివరాలు
ఆన్‌లైన్‌ టికెట్స్‌ బుకింగ్‌, రైల్వేక్యాంప్‌ మేళా
కుంభమేళా కార్యక్రమాలను జియో టీవీ ద్వారా వీక్షించే సదుపాయం. 
ఇలా ముఖ్యమైన సందేశాలు, ప్రకటనలు భక్తులకు నిత్యం అందుబాటులో ఉంటాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top