‘శాంత్రో’ రీఎంట్రీ ఈ నెల 23న | It's official! The AH2 is the All New Hyundai Santro | Sakshi
Sakshi News home page

‘శాంత్రో’ రీఎంట్రీ ఈ నెల 23న

Oct 10 2018 12:15 AM | Updated on Sep 18 2019 2:52 PM

It's official! The AH2 is the All New Hyundai Santro - Sakshi

చెన్నై: అతి త్వరలోనే ‘హ్యుందాయ్‌ శాంత్రో’ మళ్లీ మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్టోబరు 23న న్యూఢిల్లీలో సరికొత్త శాంత్రోను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు ప్రకటించిన హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌)... భారత్‌లో ఇది ఈ నెల తరువాత అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. అక్టోబర్‌ 10 (బుధవారం) నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ ప్రీ–బుకింగ్స్‌ కొనసాగనుండగా.. ప్రారంభ ఆఫర్‌ కింద తొలి 50,000 మంది కస్టమర్లకు రూ.11,100కే కారును బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నట్లు సంస్థ సీఈఓ వై.కే కూ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాలుగేళ్ల విరామం తరువాత మిడ్‌–కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లో మరోసారి అడుగుపెడుతున్నాం. గడిచిన మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ కోసం దాదాపు రూ.740 కోట్లను పెట్టుబడిగా పెట్టాం. తొలిసారి కారు కొనుగోలు చేసే వారిని, గ్రామీణ ప్రాంతాల వారిని, టైర్‌ టూ, త్రీ టౌన్ల వినియోగదారులను లక్ష్యంగా చూస్తున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి భారత్‌లో ఉత్పత్తయ్యే అధునాతన శాంత్రో కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement