బంపర్ బొనాంజా- దూసుకుపోతున్న ఐటీసీ

బంపర్ బొనాంజాతో దూసుకుపోతున్న ఐటీసీ - Sakshi


ముంబై :  ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఐటీసీ  సోమవారం నాటి మార్కెట్  లో  దూసుకుపోతోంది. 12 వరుస త్రైమాసికాల క్షీణత  తర్వాత  ఈసారి లాభాలను నమోదు చేయడంతో ఐటీసీ షేర్లు  మార్కెట్లో  జోరుగా ట్రేడవుతున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక లాభాల్లో 5.67 శాతం వృద్ధిని నమోదు చేసింది. శుక్రవారం ఐటీసీ  క్యూ 4   ఫలితాల్లో రూ 10, 060 కోట్ల అమ్మకాలతో దాదాపు రూ 2,500 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 



 గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.2,361.18 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు 9.51 శాతం పెరిగి రూ.10,062.38 కోట్లకు చేరాయని ఐటీసీ బీఎస్‌ఈకి వెల్లడించింది. 2014-15 ఇదే త్రైమాసికంలో రూ.9,188 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది.  



బోనస్:  మెరుగైన ఫలితాల నేపథ్యంలో 1:2 నిష్పత్తిలో  (ప్రతి రెండు షేర్లు ఒక షేరు ) బోనస్ షేర్లను ప్రకటించింది. బోనస్‌ షేర్ల జారీతో పాటు ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో సాధారణ షేరుకు రూ.8.50 డివిడెండ్‌ను(షేరుకు రూ .2 ప్రత్యేక డివిడెండ్ సహా ) ఇచ్చేందుకు బోర్డు సమ్మతి తెలిపింది.  ఫలితంగా బీఎస్‌ఈలో సంస్థ షేరు పరుగులు  తీస్తోంది. .

 


బుల్లిష్  ట్రెండ్: ఐటీసీ లాభాలపై  మార్కెట్ ఎనలిస్టులు, అంచనా  సంస్థలు పాజిటివ్ గా  స్పందించాయి. రాబోయే 2017సం.రానికి  ఐటీసీ మరింత పుంజుకుని రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని క్రెడిట్ స్యూజ్ కంపెనీ భరోసా ఇస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి  ఎబిట్(ఈబీఐటి)  9 శాతం ఆదాయాన్ని సాధించి అగ్రస్థానంలో నిలస్తుందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.అటు డ్యుయిష్ బ్యాంక్ సహా ట్రేడింగ్ సంస్థలన్నీ   ఐటీసీ  షేరు ధరలు మరింత  పెరగనున్నాయని అంచనావేశాయి. సాధారణ వర్షపాతం అంచనాలతో ఎఫ్ ఎంసీజీ వ్యాపారాన్ని జోరు పెంచిందనా అంచనావేస్తున్నారు. ఒక్కో షేరు 400  రూ. లను చేరుతుందని భావిస్తున్నారు. కాగా సోమవారం  ఐటిసి 5 అధిక శాతం పెరిగి రూ 347 దగ్గర  ట్రేడవుతోంది. నిఫ్టీలో అత్యధిక లాభాలతో మార్కెట్ ను లీడ్ చేస్తోంది. ఐటీసీ  వ్యాపారంలో ప్రధానమైన  సిగరెట్లపై10 శాతం ఎక్సైజ్ సుంకం వృద్ధితో కంపెనీ సిగరెట్ ధరలను 10-13 శాతం  పెంచిందని షేర్  ఖాన్ తెలిపింది.  ఐటీసీ అగ్రి వ్యాపారం రూ 1,800 కోట్లకు పెరగ్గా,  కంపెనీ హోటళ్లు /  పేపర్  వ్యాపారం  4.8 శాతం పెరిగింది.



 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top