రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ! | IOC, BPCL, HPCL sign agreement to set up $40 billion refinery | Sakshi
Sakshi News home page

రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ!

Jun 15 2017 12:58 AM | Updated on Sep 5 2017 1:37 PM

రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ!

రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ!

ప్రభుత్వరంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం...

మహారాష్ట్రలో ఏర్పాట్లు
చేతులు కలిపిన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) సంస్థలు సంయుక్తంగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ ఆయిల్‌ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు బుధవారం ఒక ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

60 మిలియన్‌ టన్నుల రిఫైనరీ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2 లక్షల కోట్లు. ఒక్క ఐవోసీయే ఇందులో సగం వాటా తీసుకోనుంది. మిగిలిన రెండు సంస్థలు మరో సగం పెట్టుబడులతో 50 శాతం వాటాను పొందుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement