ఇన్ఫోసిస్‌లో ఎగిసిన కరోడ్‌పతి ఉద్యోగులు

Infosys Crorepati Club Swells To Record 74 Members - Sakshi

షేర్ల విలువతో పెరిగిన రాబడి

సాక్షి, న్యూఢిల్లీ : దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 2019-20లో రూ కోటికి పైగా వార్షిక వేతనం అందుకుంటున్న కరోడ్‌పతుల జాబితా 74కి పెరిగింది. ఇదే కంపెనీలో అంతకుముందు ఏడాది కోటీశ్వరుల సంఖ్య 60 కావడం గమనార్హం. అధిక వేతన రాబడితో కరోడ్‌పతులుగా ఎదిగిన వారిలో అత్యధికులు వైస్‌- ప్రెసిడెంట్‌, సీనియర్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్నవారే. గతంలో మంజూరు చేసిన షేర్లు ఈ ఏడాది అందిరావడం వాటి విలువ ఆధారంగా వార్షిక వేతన రాబడి పెరిగింది. గత ఏడాది భారత్‌లో ఇన్ఫోసిస్‌  ఉద్యోగుల సగటు వేతన పెంపు 7.3 శాతంగా ఉంది.

2019-20లో ఇన్ఫోసిస్‌ సీఈఓ సలిల్‌ పరేఖ్‌ మొత్తం పారితోషికం రూ. 34.27 కోట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మొత్తంలో జీతంతో కలుపుకుని పరిహారం రూ .16.85 కోట్లు కాగా, స్టాక్‌ ఆప్షన్ల మార్గంలో రూ .17.04 కోట్లు, ఇతరత్రా చెల్లింపుల కింద రూ. 38 లక్షలు ఈయనకు చెల్లించినట్లు కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది భారత్‌లో అత్యధిక వేతనం అందుకుంటున్న ఐటీ సీఈఓ సలిల్‌ పరేఖ్‌ కావడం విశేషం. కాగా, మున్ముందు సవాళ్లతో కూడిన సమయాన్ని ఎదుర్కోవడం నిజమైన పరీక్షని, సవాళ్లను సాంకేతికతో దీటుగా ఎదుర్కొనేలా కార్యోన్ముఖులు కావాలని వాటాదారులకు రాసిన లేఖలో ఇన్ఫోసిస్‌ చీఫ్‌ నందన్‌ నిలేకాని పేర్కొన్నారు.

చదవండి : టెకీలకు ఇన్ఫీ షాక్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top