breaking news
crorepati club
-
ఇన్ఫోసిస్‌లో ఎగిసిన కరోడ్‌పతి ఉద్యోగులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 2019-20లో రూ కోటికి పైగా వార్షిక వేతనం అందుకుంటున్న కరోడ్‌పతుల జాబితా 74కి పెరిగింది. ఇదే కంపెనీలో అంతకుముందు ఏడాది కోటీశ్వరుల సంఖ్య 60 కావడం గమనార్హం. అధిక వేతన రాబడితో కరోడ్‌పతులుగా ఎదిగిన వారిలో అత్యధికులు వైస్- ప్రెసిడెంట్, సీనియర్ వైస్-ప్రెసిడెంట్ హోదాలో ఉన్నవారే. గతంలో మంజూరు చేసిన షేర్లు ఈ ఏడాది అందిరావడం వాటి విలువ ఆధారంగా వార్షిక వేతన రాబడి పెరిగింది. గత ఏడాది భారత్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగుల సగటు వేతన పెంపు 7.3 శాతంగా ఉంది. 2019-20లో ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ మొత్తం పారితోషికం రూ. 34.27 కోట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మొత్తంలో జీతంతో కలుపుకుని పరిహారం రూ .16.85 కోట్లు కాగా, స్టాక్ ఆప్షన్ల మార్గంలో రూ .17.04 కోట్లు, ఇతరత్రా చెల్లింపుల కింద రూ. 38 లక్షలు ఈయనకు చెల్లించినట్లు కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది భారత్‌లో అత్యధిక వేతనం అందుకుంటున్న ఐటీ సీఈఓ సలిల్ పరేఖ్ కావడం విశేషం. కాగా, మున్ముందు సవాళ్లతో కూడిన సమయాన్ని ఎదుర్కోవడం నిజమైన పరీక్షని, సవాళ్లను సాంకేతికతో దీటుగా ఎదుర్కొనేలా కార్యోన్ముఖులు కావాలని వాటాదారులకు రాసిన లేఖలో ఇన్ఫోసిస్ చీఫ్ నందన్ నిలేకాని పేర్కొన్నారు. చదవండి : టెకీలకు ఇన్ఫీ షాక్ -
కో అంటే జీతం కోటిపైనే..
కో అంటే కోటి రూపాయలే. ఏడాది జీతం ఎనిమిదంకెల్లోనే. ఏ అమెరికాలోనో, బ్రిటన్‌లోనో మరేఇతర దేశంలోనో కాదు. భారత్‌లోనే చాలా కంపెనీల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటీవ్‌లు ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం తీసుకుంటున్నారు. హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో ఓ విభాగానికి హెడ్‌గా పనిచేస్తున్న శ్రీరూప్ మిత్రా (33) గతేడాది జీతం కోటి రూపాయలకు పైనే తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే హెచ్‌యూఎల్‌లో మిత్రా మాదిరిగా గతేడాది కోటి రూపాయలకు పైగా జీతం తీసుకున్న ఎగ్జిక్యూటీవ్‌ల సంఖ్య 169. వీరిలో 50 శాతం మంది 40 ఏళ్ల లోపు వయసు వారు కావడం విశేషం. హెచ్‌యూఎల్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో వీరు ఒక శాతం. కాగా ఈ 169 మేనేజర్లు ఏడాది జీతం మొత్తం 310 కోట్లు. హెచ్‌యూఎల్ వార్షిక నివేదికలో ఈ విషయలు వెల్లడించారు. ఇక ఐటీసీలో 23 మంది ఉద్యోగులు కోటీశ్వరుల క్లబ్లో ఉన్నారు. ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌లో 123 మంది ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం పొందుతున్నారు. ఇలా ఉద్యోగులకు ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం ఇస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, అత్యుత్తమ ఫలితాలు సాధించగల నైపుణ్యం ఉన్న బిజినెస్ అడ్మిస్ట్రేషన్, ఇంజినీరింగ్, ఐటీ నిపుణులకు కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్, స్నాప్‌డీల్, ఓలా, ఉబెర్, కామన్‌ఫ్లోర్, బుక్‌మైషో,జబాంగ్, హంగామా, ఫ్యాఫన్అండ్యు వంటి కంపెనీలు వన్ క్రోర్ ప్లస్ జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఈకామర్స్ కంపెనీలు కోటిరూపాయలకు పైగా జీతం ఇవ్వగల 500 ఉద్యోగాలను ఆఫర్ చేశాయి.