ఇండిగో వింటర్‌ సేల్‌ : ఆఫర్‌లో 10 లక్షల టికెట్లు

IndiGo offers flight tickets from Rs 899 in new sale - Sakshi

రూ.899లకే  విమాన టికెట్‌

డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ రూట్లలో ఆఫర్‌ వర్తింపు

సాక్షి,ముంబై: బడ్జెట్‌ క్యారియర్‌ ఇండిగో  తక్కువ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది.  వింటర్‌ సేల్‌ పేరుతో  నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక విక్రయాల్లో రూ.899 (అన్నీ కలుపుకొని) లకే విమాన టికెట్లను  ఆఫర్‌ చేస్తోంది. ప్రమోషనల్‌ ఆఫర్‌గా నిర్వహిస్తున్నఈ సేల్‌లో దాదాపు 10లక్షల  సీట్లను ఆఫర్‌  చేస్తోంది.  

డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ రూట్లలో నాన్‌ స్టాప్‌ విమానాల్లో  మాత్రమే ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్టు ఇండిగో వెల్లడించింది. అంతర్జాతీయంగా  3199  రూపాయలకు  టికెట్లను అందిస్తోది. నవంబరు 21 నుంచి 25 వ తేదీలోపు బుక్‌ చేసుకున్న టికెట్ల మాత్రమేఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఇలా బుక్‌  చేసుకున్న టికెట్ల ద్వారా డిసెంబరు 6, 2018 నుంచి  ఏప్రిల్‌ 15, 2019 వరకు ప్రయాణించే అవకాశం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top