యమహా కొత్త బీఎస్‌-6 బైక్స్‌ లాంచ్‌ 

India Yamaha Motor launches BS-VI compliant variants of bikes     - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  దేశంలో త్వరలోనే కొత్త ఉద్గార నిబందనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ద్విచక్ర వాహన తయారీదారులు కూడా ఆ వైపుగా కదులుతున్నాయి. ఇప్పటికే హీరో మోటో బీఎస్‌ -6 బైక్‌ను విడుదల చేయగా, తాజాగా  ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం)కూడా ఈ కోవలోకి చేరింది.  ఇండియా యమహా మోటార్  శుక్రవారం బిఎస్-వి కంప్లైంట్ వేరియంట్లైన ఎఫ్‌జెడ్-ఎఫ్‌ఐ, ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ బైక్‌లను విడుదల చేసింది. వీటి ధరలను రూ .99,200 నుంచి రూ .1.2 లక్షల (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. రానున్న కాలంలో మరిన్ని బీఎస్‌-6 వాహనాలను తీసుకు రానున్నామని  ఐవైఎం ఒక ప్రకటనలో తెలిపింది.

తాజాగా లాంచ్‌ చేసిన ఎఫ్‌జెడ్-ఎఫ్‌ఐ, ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ వెర్షన్‌ బైక్‌లు ఫ్రంట్ వీల్‌లో సింగిల్ ఛానల్  ఏబీఎస్, ఫ్రంట్ అండ్‌ రియర్ డిస్క్ బ్రేక్‌లతో పాటు సింగిల్ పీస్ టూ లెవల్ సీటు తదితర వివిధ ఫీచర్లను పొందుపర్చింది. యమహా తన కొత్త మోటార్ సైకిళ్ళు 2019 నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా అన్ని యమహా షోరూమ్‌లలో లభిస్తాయని యమహా మోటార్ ఇండియా చైర్మన్ మోటోఫుమి శితారా చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top