ఏటీఎంల భద్రతా ప్రమాణాలను పెంచండి  

Increase ATM safety standards - Sakshi

బ్యాంకింగ్‌కు ఆర్‌బీఐ స్పష్టీకరణ

ముంబై: భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఏటీఎంలను ఆధునికీకరించాలని బ్యాంకింగ్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ నత్తనడకన సాగడాన్ని తీవ్రంగా తీసుకున్న ఆర్‌బీఐ, ఏటీఎంల అప్‌గ్రేడేషన్‌కు కాలపరిమితినీ నిర్దేశించింది, దీనిని అనుసరించకపోతే చర్యలు తప్పవని స్పష్టంచేసింది. అన్ని బ్యాంకుల చీఫ్‌లు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లకు ఈ మేరకు సెంట్రల్‌ బ్యాంక్‌ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.  

దీనిప్రకారం ఆగస్టు నాటికి భద్రతా ప్రమాణాలను అమలు చేయాలి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి  దశల వారీగా  ఆపరేటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేయాలి. ఫిబ్రవరి చివరినాటికి దేశ వ్యాప్తంగా 2.06 లక్షల ఏటీఎంలు ఉన్నాయి.  ఏటీఎంల సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌కు  2017 ఏప్రిల్‌లో ఆర్‌బీఐ ఒక సర్క్యులర్‌ జారీ చేసినప్పటికీ, బ్యాంకులు ఈ ప్రక్రియను వేగవంతం చేయడం లేదు. మరోవైపు ఏటీఎం మోసా లూ పెరుగుతున్నాయి. ఏటీఎంల భద్రతా ప్రమా ణాలు, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రెడేషన్‌ అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల బ్యాంకింగ్‌ కస్టమర్ల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top