హ్యుందాయ్‌ ఐ10 కార్ల తయారీకి బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ ఐ10 కార్ల తయారీకి బ్రేక్‌

Published Fri, Mar 10 2017 1:21 AM

హ్యుందాయ్‌ ఐ10 కార్ల తయారీకి బ్రేక్‌

న్యూఢిల్లీ: హ్యుందాయ్‌ కంపెనీ ఐ10 కార్ల తయారీని ఆపేసింది.  ధర అధికంగా ఉన్న, అధునాతన కార్ల మోడళ్లపై దృష్టి సారిస్తున్నందున ఐ10 కార్లను ఇక తయారు చేయబోమని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తెలిపింది. ఈ చిన్న కారును హ్యుందాయ్‌ కంపెనీ 2007లో మార్కెట్లోకి తెచ్చింది. దేశీయంగానూ, విదేశాల్లోనూ ఇప్పటిదాకా 16.95 లక్షల హ్యుందాయ్‌ ఐ10 కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో హ్యుందాయ్‌ స్థానాన్ని సుస్థిరం చేయడంలో ఐ10 కారుది కీలకపాత్ర.

Advertisement

తప్పక చదవండి

Advertisement