హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,848 కోట్లు 

HUL Profit Rises To Rs 1,848 Crore - Sakshi

క్యూ2లో 21 శాతం వృద్ధి

షేర్‌కు రూ.11 మధ్యంతర డివిడెండ్‌

రూ.9,708 కోట్లకు అమ్మకాలు

మాంద్యంలోనూ మంచి వృద్ధి సాధించాం: సీఎండీ

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,848 కోట్ల నికర లాభం(స్టాండ్‌అలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో ఆర్జించిన నికర లాభం(రూ.1,525 కోట్లు)తో పోలి్చతే 21 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. గృహ సంరక్షణ, సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ విభాగాల ఉత్పత్తుల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్‌ మెహతా చెప్పారు. గత క్యూ2లో రూ.9,138 కోట్లుగా ఉన్న మొత్తం అమ్మకాలు ఈ క్యూ2లో రూ.9,708 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఆరి్థక సంవత్సరానికి గాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.11 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు.

డిమాండ్‌ సమస్యలు కొనసాగుతాయ్‌.... 
ఈ క్యూ2లో నిర్వహణ లాభం 21 శాతం వృద్ధితో రూ.2,443 కోట్లకు పెరిగిందని మెహతా పేర్కొన్నారు. గత క్యూ2లో 23.7 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్‌ ఈ క్యూ2లో 24.8 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆరి్థక మందగమన కాలంలోనూ మంచి వృద్ధి సాధించామని  సంతృప్తి వ్యక్తం చేశారు. మార్జిన్లు నిలకడగా మెరుగుపడుతున్నాయని వివరించారు. సమీప భవిష్యత్తులో డిమాండ్‌ పరంగా సమస్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

గృహ సంరక్షణ విభాగం ఆదాయం గత క్యూ2లో రూ.3,080 కోట్లు ఉండగా, ఈ క్యూ2లో రూ.3,371 కోట్లకు పెరిగిందని మెహతా చెప్పారు. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ విభాగం ఆదాయం రూ.4,316 కోట్ల నుంచి రూ.4,543 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆహార, రిఫ్రెష్‌మెంట్‌ విభాగం ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.1,847 కోట్లకు చేరిందన్నారు. విల్లెమ్‌ ఉజేన్‌ను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ–సప్లై చెయిన్‌)గా నియమించామని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆయన కంపెనీ డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతారని పేర్కొన్నారు.

మార్కెట్‌ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. సానుకూల అంచనాల కారణంగా బీఎస్‌ఈలో హిందుస్తాన్‌ యూని లివర్‌ షేర్‌ 0.5 శాతం లాభంతో రూ.2,015 వద్ద  ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top