యాపిల్‌ను దాటిన గూగుల్ ‘ఆల్ఫాబెట్’ | Google parent Alphabet passes Apple market cap at the open | Sakshi
Sakshi News home page

యాపిల్‌ను దాటిన గూగుల్ ‘ఆల్ఫాబెట్’

Feb 3 2016 1:17 AM | Updated on Aug 20 2018 2:55 PM

యాపిల్‌ను దాటిన గూగుల్ ‘ఆల్ఫాబెట్’ - Sakshi

యాపిల్‌ను దాటిన గూగుల్ ‘ఆల్ఫాబెట్’

మెరుగైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ గల కంపెనీగా టెక్ సంస్థ యాపిల్‌ను అధిగమించింది.

570 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ  
 శాన్ ఫ్రాన్సిస్కో: మెరుగైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ గల కంపెనీగా టెక్ సంస్థ యాపిల్‌ను అధిగమించింది. సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత జరిగిన లావాదేవీల్లో షేరు ధర ప్రకారం ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ ఏకంగా 570 బిలియన్ డాలర్లకు ఎగిసింది. యాపిల్ మార్కెట్ విలువ 535 బిలియన్ డాలర్లు. సెలవుల సీజన్‌లో ఆన్‌లైన్ ప్రకటనల ఆదాయాల ఊతంతో డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆల్ఫాబెట్ లాభాలు 4.92 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇటు పీసీలు, అటు మొబైల్ పరికరాల విభాగాల్లోను ప్రకటనల ఆదాయం గణనీయంగా వచ్చినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement