రూ.75 కోట్లతో గివ్‌ ఇండియా ఫండ్‌ | Give India Fund With 75 Crore For Corona Victims | Sakshi
Sakshi News home page

రూ.75 కోట్లతో గివ్‌ ఇండియా ఫండ్‌

Apr 15 2020 10:00 AM | Updated on Apr 15 2020 10:00 AM

Give India Fund With 75 Crore For Corona Victims - Sakshi

న్యూఢిల్లీ: విరాళాల ప్లాట్‌ఫార్మ్‌ ‘గివ్‌ ఇండియా’ రూ.75 కోట్ల ఆరంభ విరాళంతో ‘ఇండియా కోవిడ్‌ రెస్పాన్స్‌ ఫండ్‌’ను (ఐసీఆర్‌ఎఫ్‌)  ఆరంభించింది. కరోనా కల్లోలానికి కుదేలవుతున్న వారిని ఆదుకోవడానికి ఐసీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించామని గివ్‌ ఇండియా తెలిపింది. కనీసం కోటిమందికైనా సాయమందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బిల్‌గేట్స్‌కు చెందిన బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్, గూగుల్‌.ఓఆర్‌జీ, హెచ్‌ఎస్‌బీసీ ఇండియా, మ్యారికో, ఉబెర్‌ ఇండియా తదితర సంస్థలు విరాళాలు అందజేశాయని గివ్‌ ఇండియా డైరెక్టర్‌ గోవింద్‌ అయ్యర్‌ తెలిపారు.  

ఐసీఐసీఐ విరాళం రూ.100 కోట్లు: కరోనా వైరస్‌ కల్లోలాన్ని తట్టుకోవడానికి దేశం జరిపే పోరాటంలో భాగంగా రూ.100 కోట్లు విరాళం ఇచ్చినట్లు ఐసీఐసీఐ గ్రూప్‌ తెలిపింది. పీఎమ్‌ కేర్స్‌ ఫండ్‌కు రూ.80 కోట్లు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు రూ.20 కోట్ల మేర విరాళాన్ని ఐసీఐసీఐ బ్యాంక్, దాని అనుబంధ సంస్థలు ఇచ్చాయని పేర్కొంది.

శామ్‌సంగ్‌ విరాళం రూ.20 కోట్లు
కరోనా కల్లోలాన్ని తట్టుకోవడానికి  శామ్‌సంగ్‌ ఇండియా రూ.20 కోట్ల విరాళం ఇవ్వనుంది. దీంట్లో భాగంగా పీఎమ్‌–కేర్స్‌ ఫండ్‌కు రూ.15 కోట్లు, యూపీ, తమిళనాడు రాష్ట్రాలకు రూ.5 కోట్లు ఇస్తామని శామ్‌సంగ్‌ ఇండియా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement