Indigo Chairman Devadas Mallya Passes Away in Delhi - Sakshi
Sakshi News home page

ఇండిగో ఛైర్మన్‌ హఠాన్మరణం

Nov 26 2018 10:31 AM | Updated on Nov 26 2018 12:52 PM

Expand InterGlobe Aviation Chairman Devadas Mallya has died in Delhi: Company  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో ఛైర్మన్‌ ​దేవదాస్ మాల్యా మాంగళూరు కన్నుమూశారు. న్యూఢిల్లీలో ఆదివారం ఉదయం దేవదాస్‌ తుది శ్వాస విడిచారని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇండిగో ఛైర్మన్, నాన్ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌ దేవదాస్‌ ఆకస్మికంగా మరణించారని ఈ సంస్థను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్.. స్టాక్‌మార్కెట్‌ ఫైలింగ్‌ సమాచారంలో తెలిపింది.  ఆయన హఠాన్మరణం కంపెనీకి తీరని లోటంటూ సంతాపం వ్యక్తం చేసింది. దేవదాస్‌ లేని లోటు తీరనిదని బోర్డు డైరెక్టర్లు, ఉద్యోగులు ఆయన కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా దేవదాస్‌ పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement