డ్యూక్ ఫ్యాషన్స్ ‘థర్మల్ వేర్ కలెక్షన్’ | Duke Fashions Thermal Wear Collection | Sakshi
Sakshi News home page

డ్యూక్ ఫ్యాషన్స్ ‘థర్మల్ వేర్ కలెక్షన్’

Nov 20 2015 12:10 AM | Updated on Sep 3 2017 12:43 PM

చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని.. డ్యూక్ ఫ్యాషన్స్ (ఇండియా) ‘థర్మల్ వేర్ కలెక్షన్’ను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్: చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని.. డ్యూక్ ఫ్యాషన్స్ (ఇండియా)  ‘థర్మల్ వేర్ కలెక్షన్’ను ఏర్పాటు చేసింది. ఇం దులో అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, తాజా మార్కెట్ ట్రెండ్‌కు తగినట్లుగా రూపొందించిన థర్మల్స్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. నాలుగు రంగుల్లో లభ్యమయ్యే ఈ థర్మల్స్ ధర రూ.185-రూ.740 మధ్యలో ఉంటుందని తెలిపింది. స్పెషల్ హాలో ఫైబర్‌తో కూడిన థర్మల్ ఇన్సులేషన్ టెక్నాలజీతో రూపొందించిన థర్మల్స్ శరీరాన్ని చల్లని వాతావరణంలో కూడా వెచ్చగా ఉండేలా చేస్తాయని వివరించింది. ‘తమ టార్గెట్ క స్టమర్లు యువత. నాణ్యతతో కూడిన అంతర్జాతీయ డిజైన్లతో వారికి చేరువకావడమే తమ లక్ష్యం’ అని డ్యూక్ ఫ్యాషన్స్ డెరైక్టర్ కుంతల్ రాజ్ జైన్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement