హైదరాబాద్ లో పెరిగిన హాలిడే బుకింగ్స్ | Cox and Kings partners with RBL Bank to launch holiday savings program | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో పెరిగిన హాలిడే బుకింగ్స్

Mar 10 2016 1:41 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఫ్యామిలీ హాలిడే బుకింగ్స్ హైదరాబాద్‌లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 15 శాతంమేర పెరిగినట్లు టూర్ అండ్ ట్రావెల్ కంపెనీ ‘కాక్స్ అండ్ కింగ్స్’ పేర్కొంది.

హైదరాబాద్: ఫ్యామిలీ హాలిడే బుకింగ్స్  హైదరాబాద్‌లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 15 శాతంమేర పెరిగినట్లు టూర్ అండ్ ట్రావెల్ కంపెనీ ‘కాక్స్ అండ్ కింగ్స్’ పేర్కొంది. హైదరాబాదీలు ఎక్కువగా (65 శాతం) వేసవి కాలంలో విహరయాత్రకు వెళ్తున్నారని తెలిపింది. దీనికి ఆదాయం పెరుగుదల, పిల్లలకు సెలవులు ఉండటం తదితర అంశాలను కారణంగా పేర్కొంది. వీరు వేసవి తాపం నుంచి సేదతీరడానికి ఊటీ, అరకు, మున్నార్, సిమ్లా, కశ్మీర్, కొడెకైనాల్ వంటి చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్తున్నారని ‘కాక్స్ అండ్ కింగ్స్’ రిలేషన్‌షిప్స్ హెడ్ కరణ్ ఆనంద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement