ప్లాస్టిక్‌ వేస్ట్‌లో ‘కోకాకోలా’ నంబర్‌వన్‌!

Coca Cola Is The Most Polluting Brand Of Plastic Waste - Sakshi

న్యూఢిల్లీ : ‘కోకాకోలా’ కూల్‌ డ్రింక్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణకు అత్యంత ప్రమాదకారిగా మారింది కూడా ఈ బ్రాండ్‌ ప్లాస్టిక్‌ సీసాలే. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్లాస్టిక్‌ వేస్టేజ్‌ని సృష్టిస్తున్నది జార్జియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కోకాకోలా కూల్‌ డ్రింక్స్‌ కంపెనీ అని ఓ అధ్యయనంలో తేలింది. ఆ తర్వాత స్థానాల్లో నెస్లే, పెప్సికో, మాండెలెజ్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు సృష్టిస్తున్న ప్లాస్టిక్‌ వేస్టేజ్‌కి సమానంగా ఒక్క కోకాకోలా కంపెనీయే సృష్టిస్తున్నట్లు ‘బ్రేక్‌ ఫ్రీ ఫ్రమ్‌ ప్లాస్టిక్స్‌’ అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ ఇటీవల తన 72 వేల మంది కార్యకర్తలతో ప్రపంచవ్యాప్తంగా బీచ్‌ల వద్ద, కాల్వలు, చెరువుల వెంట, రోడ్ల పక్కన ప్లాస్టిక్‌ బాటిళ్లు, కప్పులు, ర్యాపర్లు, బ్యాగ్స్, ఇతర ప్లాస్టిక్‌ను ఏరించింది.


దొరికిన ఇతర ప్లాస్టిక్కులతో దొరికిన కోకాకోలా, ఇతర కూల్‌ డ్రింక్‌ల ప్లాస్టిక్‌ బాటిళ్లను లెక్కపెట్టిచ్చింది. సరాసరిన 4,75,000 ప్లాస్టిక్‌లను సేకరించగా, వాటిలో 11,732 కోకాకోలా ప్లాస్టిక్‌ బాటిల్లే ఉన్నాయి. వీటిలో ఎనిమిది వేల బ్రాండ్‌లకు చెందిన 50 రకాల ప్లాస్టిక్‌లను బయట పడ్డాయి. నెస్లే, పెప్సికో, మాండెలెజ్‌ల తర్వాత యూనిలివర్, మార్స్, పీఅండ్‌జీ, కాల్గేట్‌–పామోలివ్, ఫిలిప్‌ మోరీస్‌ బ్రాండ్‌లు ఉన్నాయి. ఆఫ్రికా, యూరప్‌లలో అత్యధిక వేస్టేజ్‌లో కోకాకోలా నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండగా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లో రెండో స్థానంలో ఉంది. నెస్టిల్‌ బ్రాండ్‌ ఉత్తర అమెరికాలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఎరుపు రంగు కప్పులను తయారు చేసే సోలో కంపెనీ రెండో స్థానంలో ఉండగా, స్టార్‌ బక్స్‌ మూడో స్థానంలో ఉంది. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌కు బదులు రీసైక్లింగ్‌కు ఉపయోగించే ప్లాస్టిక్‌ను వాడడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, మొత్తంగానే ప్లాస్టిక్‌ను వదిలేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని ప్రపంచ కార్పొరేట్‌ సంస్థలకు ఈ సందర్భంగా ‘బ్రేక్‌ ఫ్రీ ఫ్రమ్‌ ప్లాస్టిక్‌’ సంస్థ పిలుపునిచ్చింది. (చదవండి: రాజధానిలో హెల్త్‌ ఎమర్జెన్సీ)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top