బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లాభం రూ.403 కోట్లు

Britannia Industries profits rise to Rs 403 crore - Sakshi

33 శాతం వృద్ధి  

6 శాతం వృద్ధితో రూ.3,023 కోట్లకు నికర అమ్మకాలు

న్యూఢిల్లీ: బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో రూ.403 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.303 కోట్లుతో పోల్చితే 33 శాతం వృద్ధి సాధించామని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తెలిపింది. నికర అమ్మకాలు రూ.2,855 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.3,023 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎమ్‌డీ వరుణ్‌ బెర్రి పేర్కొన్నారు.  

మార్కెట్‌ కంటే వేగంగా వృద్ధి సాధించడాన్ని కొనసాగిస్తున్నామని వరుణ్‌ తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయం 13 శాతం పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.2,455 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ2లో 6 శాతం వృద్ధితో రూ.2,618 కోట్లకు పెరిగాయని తెలిపారు. ముడి చమురు ధరలు పెద్దగా పెరగకపోవడంతో వ్యయాలు పెద్దగా పెరగలేదని వివరించారు. అందుకే ఈ క్యూ2లో అత్యధిక నిర్వహణ లాభం సాధించామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ షేర్‌ 1.4 శాతం నష్టంతో రూ.3,116 వద్ద  ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top