జియోకు చెక్‌:ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్..తక్కువ ధరలో

Airtel partners with Celkon to offer 4G smartphones for Rs 1,349

సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం  మేజర్‌  భారతీ ఎయిర్‌టెల్‌ సెల్‌కాన్‌ ..మొబైల్ ఫోన్ తయారీదారు సెల్‌కాన్‌తో జతకట్టింది.   ముఖ్యంగా ప్రత్యర్థి  రిలయన్స్‌ జియోకు చెక్‌ పెట్టేలా త క్కువ ధరలో 4 జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది.  తన చందాదారులకు  అతి తక్కువ ధరకే   మొబైల్‌ అందించే  వ్యూహంలో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుంది. సెల్‌కాన్‌ తో కలిసి  రూ.1,349 కే స్మార్ట్‌ఫోన్‌ను  అందజేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌’ పథకంలో భాగంగా ఫీచర్‌ ఫోన్‌ ధరలోనే  స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. 'సెల్‌కాన్‌న్ స్మార్ట్ 4 జి' (మార్కెట్ ధర రూ. 3,500)   పేరుతో దీన్ని విడుదల చేయనుంది. 4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ డ్యూయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్ ఆధారిత  4జీ స్మార్ట్‌ఫోన్‌ లో గూగుల్‌ ప్లే లోని  వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూ ట్యూబ్‌ తదితర అన్ని  యాప్‌లకు అనుమతి ఉంది.

ఇటీవల  కార్బన్ ఎ40 ఇండియన్ పేరిట కేవలం రూ.1399కే 4జీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుదల  చేసిన ఎయిర్‌టెల్‌ తాజాగా  సెల్‌కాన్‌తో జతకట్టి మరో 4జీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే  ఈ సెల్‌కాన్ స్మార్ట్ 4జీ ఫోన్‌ను వినియోగదారులు ముందుగా రూ.2,849 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుది. ఇందులో నెలకు రూ.169 రీచార్జ్‌ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది.  ఇలా నెలకు రూ.169 చొప్పున 36 నెలల పాటు రీచార్జి చేస్తూ ఫోన్‌ను వాడాలి. అలా వాడితే మొదటి 18 నెలలకు రూ.500, తరువాత 36 నెలలకు రూ.1000 వెనక్కి ఇస్తారు.  అంటే మూడు సంవత్సరాలకు  మొత్తం రూ.1500 వెనక్కి ఇస్తుంది. ఈ లెక్క ప్రకారం  ఫోన్ ధర కేవలం రూ.1349 మాత్రమే అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ తోపాటు  రోజుకు 500 ఎంబీ 4జీ డేటా ఉచితం. వాలిడిటీ 28 రోజులు.  

ఒకవేళ రూ .169 రీచార్జ్‌ ఇష్టంలేని  వినియోగదారులు  వారి అవసరాలకు అనుగుణంగా ఏ రీఛార్జ్‌ ప్లాన్‌ అయినా  వినియోగించుకోవచ్చు.  అయితే, రూ .500 మొదటి వాపసును క్లెయిమ్ చేయటానికి, మొదటి 18 నెలల్లో రూ. 3000 విలువ గల రీఛార్జిలు చేసుకోవాలి. అలాగే రూ. 1,000  రిఫండ్‌ కావాలంటే  18 నెలల్లో రూ. 3000 రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.  అంటే 36 నెలలు, మొత్తం రీఛార్జి రూ. 6,000.

కాగా దక్షిణ భారత మార్కెట్లలో బలమైన బ్రాండ్‌ అనుబంధం, తక్కువధరలో వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌ను అందించేందుకు సెల్‌కాన్‌తో జత కట్టడం సంతోషంగా ఉందని  భారతి ఎయిర్టెల్‌ సీఎంవో పూడిపెద్ది రాజ్‌  ప్రకటించారు. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌ తమకు మంచి ప్రోత్సాహం లభించిందనీ, ఈ సిరీస్‌లో భవిష్యత్తులో  మరిన్ని భాగస్వామ్యాలతో ,మరిని డివైస్‌లను లాంచ్‌  చేయనున్నామని తెలిపారు.
 

సెల్‌కాన్ స్మార్ట్ 4జీ ఫీచర్లు
4  అంగుళాల  డిస్‌ప్లే
800 x 480 రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాల్లౌ
1 జీబీ ర్యామ్  
8జీబీ స్టోరేజ్,
32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
3.2 ఎంపీ రియర్‌ కెమెరా
2 ఎంపీ  సెల్ఫీ కెమెరా
1500 ఎంఏహెచ్ బ్యాటరీ

తక్కువ ధరలో ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top