గ్రహం అనుగ్రహం (22-02-2020)

Daily Horoscope in Telugu(22-02-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.చతుర్దశి సా.6.28 వరకు తదుపరి అమావాస్య, నక్షత్రం శ్రవణం ఉ.11.10 వరకుతదుపరి ధనిష్ఠ, వర్జ్యం ప.2.20 నుంచి 4.10 వరకు దుర్ముహూర్తం ఉ.6.26 నుంచి 7.58 వరకు, అమృతఘడియలు... రా.1.46 నుంచి 2.33 వరకు.

సూర్యోదయం :    6.27
సూర్యాస్తమయం    :  5.59
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం: 

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. సోదరులతో సఖ్యత. పనులలో విజయం. ఆలయాలు  సదర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

వృషభం: సన్నిహితులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చకాకులు. దైవదర్శనాలు.అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

మిథునం: అనుకోని ప్రయాణాలు. కుంటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు పెరుగుతాయి. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడులు.

కర్కాటకం: శ్రమ పడ్డ ఫలితం కనిపిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహ యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహం.

సింహం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలత.

కన్య: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక  చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

వృశ్చికం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత అనుకూలత.

ధనుస్సు: బాధ్యతలు తప్పవు.  పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. సోదరుతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులు.

మకరం: స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహస్తారు. సంఘంలో గౌరవం. భూలాభాలు కలుగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్తో ప్రోత్సాహం.

కుంభం: సన్నిహితులు, మిత్రులతో కలహాలు, అనుకోని ప్రయాణాలు.  రుణ యత్నాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. 

మీనం: మిత్రుల నుంచి సహాయం. ఆర్థిక      లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్తో ముందడుగు.
-సింహంభట్ల  సుబ్బారావు

 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top