ఫుడ్‌ డెలివరీబాయ్‌ నిజాయితీ

Zomato Food Delivery Boy Hand Bag Return in Police Station West Godavari - Sakshi

పశ్చిమగోదావరి,తణుకు:  ఫుడ్‌ డెలివరీబాయ్‌ నిజాయితీ చాటుకున్నాడు. పట్టణంలోని వేల్పూరు రోడ్డులో ఒక మహిళ పోగొట్టుకున్న హ్యాండ్‌బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పగించాడు. పోలీసుల కథనం ప్రకారం.. తణుకు పట్టణానికి చెందిన ఉండవల్లి సునీత ఆదివారం ఉదయం లక్ష్మీ థియేటర్‌ ఎదురుగా తన బ్యాగును పోగొట్టుకున్నారు. బ్యాగులో రూ.50 వేలు విలువైన సెల్‌ఫోన్, రూ.10 వేలు నగదుతోపాటు విలువైన పత్రాలు ఉన్నాయి. అయితే ఫుడ్‌ డెలివరీబాయ్‌ పొన్నగంటి వెంకటనాగ ధనుంజయరావుకు బ్యాగు దొరకడంతో నిజాయితీగా పట్టణ ఎస్సై కె.రామారావుకు అప్పగించాడు. బ్యాగులోని పత్రాల ఆధారంగా పోగొట్టుకున్న మహిళ ఆచూకీ తెలుసుకుని ఆమెకు బ్యాగును పోలీసులు అప్పగించారు. నిజాయితీగా బ్యాగును పోలీసులకు అప్పగించిన ధనుంజయరావును కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, తణుకు సీఐ డి.ఎస్‌.చైతన్యకృష్ణ అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top