‘అందుకే టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు’ | YSRCP MLA Kakani Govardhan Reddy Comments On Chandrababu And Lokesh | Sakshi
Sakshi News home page

టీడీపీని ప్రజలు చీదరించుకుంటున్నారు

Jun 21 2020 6:19 PM | Updated on Jun 21 2020 6:25 PM

YSRCP MLA Kakani Govardhan Reddy Comments On Chandrababu And Lokesh - Sakshi

సాక్షి, నెల్లూరు: అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేస్తే బీసీలపై దాడి అంటూ గోల చేసిన టీడీపీ.. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌ అయితే కులం గురించి ఎందుకు మాట్లాడలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. శాసనమండలిలో టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరించారని, అభివృద్ధి బిల్లులను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మండలిలో లోకేష్‌ సభ్యుడిగా కాకుండా వీడియో గ్రాఫర్‌గా మారారని ఎద్దేవా చేశారు. శాసనమండలిలో టీడీపీ ప్రవర్తనను ప్రజలు చీదరించుకున్నారన్నారు. గత పాలనలో వాటర్‌ ట్యాంకులు, అన్న క్యాంటిన్లు, పంచాయతీ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులకు పచ్చ రంగులు వేసిన టీడీపీ, ఇప్పుడు రంగులపై గగ్గోలు పెడుతుందని మండిపడ్డారు. (వర్లకే అలా..ఇక మనకెలా!) 

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏమిటో తెలిసిందని, ఏడాదికాలంలోనే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారన్నారు. గెలిచే అవకాశం ఉండగా ఎస్సీలను రాజ్యసభకు పంపకుండా.. ఓడిపోయే సమయంలో వర్ల రామయ్యను బలి చేశారన్నారు. ఎన్నికల్లో గెలించేందుకు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే విస్మరించారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తుండటంతో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారని కాకాణి గోవర్ధన్‌ పేర్కొన్నారు. (గిరిజన హక్కులను హరించింది చంద్రబాబే) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement