గొట్టిపాటిపై దాడికి నిరసన | ysrcp leaders slams attack on gottipati ravikumar | Sakshi
Sakshi News home page

గొట్టిపాటిపై దాడికి నిరసన

Jan 14 2015 1:03 PM | Updated on May 29 2018 4:18 PM

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిపై దాడిని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

అనంతపురం: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిపై దాడిని అనంతపురం  జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. గొట్టిపాటిపై దాడిని నిరసిస్తూ వారు వినూత్న ప్రదర్శన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రవిపై దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ఆర్ సీపీ నేత ఎర్రస్వామిరెడ్డి డిమాండ్ చేశారు. ఇటాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోనే ఎమ్మెల్యే రవికుమార్ పై కరణం వర్గీయులు సోమవారం దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే కారు అద్దాలను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినవిషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement