
వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో సాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో మందస మండలం నారాయణ పురం వద్ద మంగళవారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా పార్టీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కంచిలి మండలం ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, కృష్ణారావులు ఏటా పార్టీ క్యాలెండర్ ముద్రించి పంచుతున్నారు. ఈ ఏడాది 40 వేల క్యాలెండర్లు ముద్రించామని, జగన్ చేతులమీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని లోలాక్షి తెలిపారు. ఆమెతో పాటు వైస్ ఎంపీపీ ఎం.శేషమ్మ, మంజు, మన్మధ, వీరస్వామి, ఈశ్వరమ్మ, జగదీష్ తదితరులు ఉన్నారు.