
సాక్షి, తూర్పుగోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 209వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఆయన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నుంచి జననేత పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సోమేశ్వరం, సీతమ్మ తోట, లొల్ల గ్రామం మీదుగా రాయవరం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 208వ రోజు ముగిసింది. ఆదివారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పసలపూడి, చెల్లూరు మీదుగా మాచవరం వరకు పాదయాత్ర కొనసాగింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. నేడు జననేత 9.1కిలో మీటర్లు నడిచారు. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 2,507.4కిలో మీటర్లు నడిచారు.