పురుగుల అన్నం తినేదెలా!

Worms rice In Mid Day Meal YSR Kadapa - Sakshi

ఆదర్శపాఠశాలలో విద్యార్థులకు అవస్థలు

ప్రశ్నిస్తే తప్పని వేధింపులు

రామాపురం : పేద విద్యార్థులకు కొర్పొరేట్‌ స్థాయిలో విద్యను అందించాలనే సంకల్పంతో  మండలానికి ఒక ఆదర్శపాఠశాలలను ఏర్పాటు చేశారు.అయితే వీటిల్లో వసతులు అంతంతమాత్రమే. విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలోనూ నాణ్యత ప్రమాణాలు లోపించాయి. ఈ విషయాన్ని అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు విలేకరుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సోమవారం ఉదయం వంట చేస్తున్న సమయంలో విలేకరులు పరిశీలించారు.  అన్నం, కూరలు, అల్పాహారానికి అందించే ఇడ్లీలపై సైతం పురుగులు ఉండటం గమనార్హం.

ఈ పథార్థాలను విద్యార్థులు తినలేక..బయటకు చెప్పుకోలేక అవస్థలకు గురవుతున్నారు.ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళితే వారిని మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తినలేక 30శాతం మంది విద్యార్థులు తమ ఇళ్లనుంచి క్యారియర్లలో భోజనాలు తెచ్చుకుంటున్నారు. ఈ విషయం గురించి   ప్రిన్సిపాల్‌ అత్తావుల్లాతో మట్లాడగా  సిబ్బంది కొరత, వంట ఏజెన్సీల నియామకంలో జాప్యం, ప్రైవేట్‌ వ్యక్తుల చేత పాఠశాలలో వంట వండించడం వల్ల ఇలా జరిగిందని, ఇకపై ఇటాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top