అధికారులు మంచి నీటి సౌకర్యం కల్పించకపోవడంతో 100 మంది మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.
అట్లూరు (విశాఖపట్నం) : అధికారులు మంచి నీటి సౌకర్యం కల్పించకపోవడంతో 100 మంది మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. ఈ సంఘటన గురువారం విశాఖ జిల్లా అట్లూరు మండల కేంద్రంలో జరిగింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో తాగునీటి నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో మహిళలు అధికారులకు విన్నవించుకున్నారు.
అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని ఎంపీడీవోను బయటకు పంపి కార్యాలయానికి తాళం వేశారు. అక్కడ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకొని ఖాళీ బిందెలతో బైఠాయించారు. వెంటనే తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు.