చిత్తూరు జిల్లా బి.కోట మండలం గండ్లపల్లి, కొత్తూరు గ్రామాలకు చెందిన మహిళలు తాగునీటి కోసం బుధవారం ఆందోళనకు దిగారు.
బి.కోట: చిత్తూరు జిల్లా బి.కోట మండలం గండ్లపల్లి, కొత్తూరు గ్రామాలకు చెందిన మహిళలు తాగునీటి కోసం బుధవారం ఆందోళనకు దిగారు. వందమందికి పైగా మహిళలు ఖాళీ బిందెలతో తరలి వచ్చారు. ముందుగా పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో 219వ నంబరు జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు కల్పించుకుని ఆందోళనను విరమింపజేశారు. తరువాత రహదారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలు రాకపోకలు సజావుగా సాగాయి.