పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో ఓ మహిళ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
చాగల్లు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో జన్మభూమి కార్యక్రమంలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన ఇంటిపక్కన సెల్ టవర్ నిర్మించవద్దంటూ ఓనగట్లకు చెందిన ఓ మహిళ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్సందించిన చుట్టుపక్కల వారు ఆ మహిళను కాపాడారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.
తన ఇంటి పక్కన సెల్ టవర్ నిర్మించవద్దంటూ మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో వేరే దారిలేక బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిందని స్థానికులు చెబుతున్నారు.