మహిళా సర్పంచ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
మహిళా సర్పంచ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో గురువారం వెలుగుచూసింది. స్థానిక యాదవ వీధిలో నివాసముంటున్న అరుణమ్మ(34) వెంకటతిమ్మాపురం గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.