బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. మహిళ మృతి | Woman killed in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. మహిళ మృతి

Feb 29 2016 3:09 PM | Updated on Aug 30 2018 3:58 PM

అతివేగంగా ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న వివాహిత మృతిచెందింది.

అతివేగంగా ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న వివాహిత మృతిచెందింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని హుక్కుంపేట వద్ద సోమవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన భువనేశ్వరి(22) భర్తతో కలిసి బైక్‌పై రాజమండ్రి వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టింది.

దీంతో భువనేశ్వరి తలకు బలమైన గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనలో ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement