విద్యుత్‌ షాక్‌తో మహిళ మృతి | Woman killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో మహిళ మృతి

May 8 2018 7:18 AM | Updated on Sep 5 2018 2:26 PM

Woman killed by electric shock - Sakshi

సంతబొమ్మాళి: మోటార్‌ అన్‌ చేయడానికి వెళ్లిన మహిళ విద్యుత్‌ షాక్‌తో మృతిచెందింది. మండలంలోని లక్ష్మీపురం జంక్షన్‌లో ఉన్న  ఇటుకల బట్టీ వద్ద ఈ సంఘటన సోమవారం జరిగింది. పొట్టకూటి కోసం స్థానిక గురువులకు చెందిన ఇటుకల బట్టీలో ఎండమూరి రాజులు(40) పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం నీటి కోసం మోటారు ఆన్‌ చేసింది. ఎంతకూ నీరు రాకపోవడంతో మోటారు బోటు వద్దకు వెళ్లింది. అప్పటికే అక్కడ కట్టి ఉన్న ఆవు వైరును బయటకు లాగేసింది. ఇది గమనించని రాజులు ఆ వైరును పట్టుకోవడంతో విద్యుత్‌ షాక్‌ తగిలి మృతిచెందింది. ఆమె స్వగ్రామం విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని కొటగాం. ఆమె అవివాహిత. రాజులు మూగ, చెముడు. ఆమె మృతిపై సంతబొమ్మాళి ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement