సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం | Will be challenged in the Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం

Oct 24 2016 2:24 AM | Updated on Nov 9 2018 5:56 PM

సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం - Sakshi

సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు

ట్రిబ్యునల్ తీర్పుపై మంత్రి ఉమా

 సాక్షి, అమరావతి: బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు నీటి విడుదలకు సంబంధించిన ‘మాన్యువల్’పై బ్రిజేష్‌కుమార్ తీర్పు వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి ఆదివారం విజయవాడలో మీడియాకు వివరించారు.

సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు, అంతర్రాష్ట్ర అధికారులతో రెండు మూడు రోజుల్లో సంప్రదింపులు జరిపి, సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన అసమర్థ విధానాలతోనే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగేలా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని వివరించారు. బ్రిజేష్‌కుమార్ తీర్పు, అంతకు ముందు జరిగిన అంశాలన్నింటినీ క్రోడీకరించిన సంచికను రైతుల అవగాహన కోసం పంపిణీ చేయనున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement