
కేసీఆర్‌పై మందకృష్ణ ఎందుకు పోరాడటం లేదు..
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్ పై మందకృష్ణ ఎందుకు పోరాటం చేయడం లేదని ఏపీ మంత్రి జవహర్ ప్రశ్నించారు.
అమరావతి: తెలంగాణలో దళితుల సమస్యలపై , దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్ పై మందకృష్ణ ఎందుకు పోరాటం చేయడం లేదని ఏపీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ వచ్చిన తర్వాతే మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత వచ్చిందన్నారు. టీడీపీ మాత్రమే మాదిగలకు న్యాయం చేస్తుందని తెలిపారు. వర్గీకరణ అంశం మా చేతుల్లో లేదని , చట్టప్రకారం దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
మద్యం అమ్మకాల్లో ఎటువంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారని వివరించారు. సుప్రీం కోర్టు నిబంధనల మేరకే షాపులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మద్యం షాపులకు దేవుళ్ల పేర్లు పెట్టొద్దని, కేవలం రిజిస్ట్రేషన్స్ లో పేర్లు పెట్టుకోవచ్చునని సూచించారు. మహిళలకు ఎక్కడైనా సమస్యలుంటే తనకు నేరుగా 9951314101 అనే నెంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. మద్యం కల్తీకి పాల్పడితే టాడా కేసులు పెడతామని హెచ్చరించారు.