కఠిన చర్యలు తీసుకుంటాం: అనురాగ్ శర్మ
ఎన్నికల అభ్యర్థుల ప్రచారం ఆపివేయాలని ఎన్నికల అధికారులు, పోలీసులు అధికారులు రాజకీయ పార్టీలకు సూచించారు.
హైదరాబాద్: ఎన్నికల అభ్యర్థుల ప్రచారం ఆపివేయాలని ఎన్నికల అధికారులు, పోలీసులు అధికారులు రాజకీయ పార్టీలకు సూచించారు. సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనురాగ్ శర్మ హెచ్చరించారు.
తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ 30 తేదిన జరుగనున్న ఎన్నికల కోసం 37 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామని అనురాగ్ శర్మ తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని సీపీ అనురాగ్ శర్మ తెలిపారు.
ఎలక్ష్ట్రానిక్ మీడియాపై ఆంక్షల్ని ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌పై ఎన్నికల కమీషన్ పూర్తిగా నిషేధం విధించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపిన సంగతి తెలిసిందే.