బీసీల సమరభేరి | we will fought for Telangana state | Sakshi
Sakshi News home page

బీసీల సమరభేరి

Jan 31 2014 4:08 AM | Updated on Sep 2 2017 3:11 AM

‘‘తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుంటున్నాం. ఇక అందరూ పోరాడేది బీసీవాదం పైనే’’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. గురువారం చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించిన బీసీ విద్యార్థి, యువజన సమరభేరి సభలో ఆయన మాట్లాడారు.

 ‘‘తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుంటున్నాం. ఇక అందరూ పోరాడేది బీసీవాదం పైనే’’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. గురువారం చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించిన బీసీ విద్యార్థి, యువజన సమరభేరి సభలో ఆయన మాట్లాడారు.
 - న్యూస్‌లైన్, చౌటుప్పల్
 
 చౌటుప్పల్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉండడంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుం టున్నారు.. ఇక అందరూ పోరాడేది బీసీ వాదంపై నే అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణ య్య స్పష్టం చేశారు. చౌటుప్పల్‌లోని గాంధీపార్కులో గురువారం జరిగిన బీసీ విద్యార్థి, యువజన సమరభేరి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిం చారు. రాజ్యాధికారం కోసం బీసీలు సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
 
 అగ్రకులాల వారు ఏ పా ర్టీలో ఉన్న రాజ్యాధికారం కోసం ఏకమవుతారని, అం దుకే అధిక సంఖ్యలో చట్టసభలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. దొరల రాజ్యం పోవాలంటే అగ్రకులాలకు సీట్లిచ్చే పార్టీలకు ఓట్లు వేయవద్దని విజ్ఞప్తి చేశారు.అగ్రకుల వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు జిల్లాలో 6 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని కోరారు.
 
 ఎన్నికల మెనిఫెస్టోలో బీసీ బిల్లు, బీసీల కోసం ప్రవేశపెట్టే పథకాలను చేర్చాలన్నారు.  త్వరలో నల్లగొండలో 2లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలి పారు. సభలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య, జెల్లా మార్కండేయులు,చంద్రకళ, లావణ్య, అంజయ్య, జం గయ్య, మాజీ మావోయిస్టు నేత శ్రీరాముల శ్రీనివాస్, పల్లె రవికుమార్, గౌరీశంకర్, రమణగోని శంకర్, తిరుమని కొండల్, చక్రహరి రామరాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement