హుదూద్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ డిపోలపై తూనికలు, కొలతల శాఖ సోమవారం ఉదయం దాడులు నిర్వహించింది
	విశాఖ :  హుదూద్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ డిపోలపై  తూనికలు, కొలతల శాఖ సోమవారం ఉదయం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా విశాఖలో 9, శ్రీకాకుళంలో 4 దుకాణాలపై అధికారులు కేసులు నమోదు చేశారు. అధికారుల జరిపిన దాడుల్లో సరుకుల నిల్వలో తేడాలున్నట్లు గుర్తించారు. దాంతో కేసులు నమోదు చేసి, సరుకులను సీజ్ చేశారు.
	
	మరోవైపు ఎవరైనా నిత్యావసర సరకులను ఎక్కువ ధరకు విక్రయిస్తే 0891-2550706కు ఫోన్ చేయాల్సిందిగా ప్రాంతీయ నిఘా, అమలు అధికారి సూచించారు. కాగా నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
