'మేము చెబుతున్నదే ఇవాళ జరిగింది' | Vasireddy Padma Comments on Sadavarti lands Auction | Sakshi
Sakshi News home page

'మేము చెబుతున్నదే ఇవాళ జరిగింది'

Sep 18 2017 2:48 PM | Updated on Sep 19 2017 4:44 PM

'మేము చెబుతున్నదే ఇవాళ జరిగింది'

'మేము చెబుతున్నదే ఇవాళ జరిగింది'

సదావర్తి సత్రం భూముల వేలంకు అనూహ్య స్పందన లభించడం శుభపరిణామని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.

సాక్షి, హైదరాబాద్‌: సదావర్తి సత్రం భూముల వేలంకు అనూహ్య స్పందన లభించడం శుభపరిణామని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మొదటి నుంచి తాము చెబుతున్నదే ఇవాళ జరిగిందన్నారు. ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేయాలని టీడీపీ నాయకులు చూశారని, అలా జరగకూడదని తాము కోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఇవాళ వేలంలో గరిష్ట ధర పలకడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు.

సదావర్తి సత్రం భూముల విషయంలో న్యాయం గెలిచిందని, ఇది కచ్చితంగా వైఎస్సార్‌ సీపీ విజయమని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి.. చెన్నైలో వ్యాఖ్యానించారు. వేలం వివరాలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని, న్యాయస్థానం ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ కమిషనర్‌ అనురాధ తెలిపారు.

సంబంధిత కథనాలు:

రూ.60.30 కోట్లు పలికిన సదావర్తి భూములు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement