బిస్మిల్లా యువపురస్కార్ ప్రదానం

బిస్మిల్లా యువపురస్కార్ ప్రదానం


కూచిపూడి: కృష్ణాజిల్లాకు చెందిన యువ కూచిపూడి నాట్య కళాకారుడు వేదాంతం సత్యనరసింహశాస్త్రి ‘ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్ 2012’ అందుకున్నారు. శనివారం రాత్రి త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య ఈ అవార్డును ప్రదానం చేశా రు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డు కింద రూ.25 వేల నగదు, రజత పతకం, శాలువాను అందజేసింది. కూచిపూడిలోని ప్రముఖ నాట్యాచార్యుడు కళారత్న వేదాంతం రాధేశ్యాం కుమారుడైన నరసింహశాస్త్రి ప్రస్తుతం హైదరాబాద్‌లో కూచిపూడి నృత్యాన్ని ప్రచారం చేస్తున్నారు.

 

 

 అవార్డు ప్రదాన కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ లీలా శ్యాంసన్ కూడా పాల్గొన్నారు. శాస్త్రికి అవార్డు రావడంపై కళాకారులు పసుమర్తి కేశవప్రసాద్, డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి, వై.కె.డి.ప్రసాదరావు, రవిబాలకృష్ణ హర్షం ప్రకటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top