స్టీల్‌ప్లాంట్‌లో మహిళ మృతదేహం | unidentified woman died in vizag stell plant | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌లో మహిళ మృతదేహం

Oct 28 2015 1:33 PM | Updated on Sep 28 2018 3:41 PM

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పార్క్‌లో గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. బుధవారం పార్క్‌లో పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులకు పార్క్‌లోపల ఉన్న బోటింగ్ కొలనులో మృతదేహం కనిపించింది.

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పార్క్‌లో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. బుధవారం పార్క్‌లో పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులకు పార్క్‌ లోపల ఉన్న బోటింగ్ కొలనులో మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుమారూ 40 సంవత్సరాల వయసున్న మహిళ ఆత్మహత్య చేసుకుందా.. లేక ఎవరైన హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement