వేగంగా వెళ్తున్న బైక్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో.. ద్విచక్రవాహనం పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
వేగంగా వెళ్తున్న బైక్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో.. ద్విచక్రవాహనం పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన కృష్ణజిల్లా మైలవరం బైపాస్ వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మంగళగిరి నుంచి తల్లాడ వైపు బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు మైలవరం ఫారెస్ట్ కార్యాలయం సమీపంలో రోడ్డు పక్కన నిలిచి ఉంచిన లారీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇది గుర్తించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.