భారీ స్థాయిలో బెట్టింగ్ పాల్పడుతున్నబుకీల అరెస్ట్ | two bookies of cricker held | Sakshi
Sakshi News home page

భారీ స్థాయిలో బెట్టింగ్ పాల్పడుతున్నబుకీల అరెస్ట్

Nov 28 2014 5:36 PM | Updated on Aug 25 2018 5:38 PM

క్రికెట్ బుకీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

ప్రకాశం: క్రికెట్ బుకీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.  భారీస్థాయిలో బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను అరెస్ట్ చేసిన ఘటన ప్రకాశంలో చోటు చేసుకుంది. తూము వెంకట్రావు, డాకా రమణారెడ్డిలు క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బెట్టింగ్ లు తారస్థాయిలో జరుగుతున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు వారిపై నిఘా ఉంచారు.

 

చాకచక్యంగా ఆ ఇద్దరు బుకీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ బుకీల వద్ద రూ.4 లక్షలతోపాటు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement