తిరుమల పోస్టాఫీసులో ఆన్‌లైన్ టికెట్లు | TTD office online tickets | Sakshi
Sakshi News home page

తిరుమల పోస్టాఫీసులో ఆన్‌లైన్ టికెట్లు

Feb 7 2015 12:59 AM | Updated on Sep 2 2017 8:54 PM

తిరుమల పోస్టాఫీసులోనూ శనివారం నుంచి రూ. 300ల టికెట్లను ఆన్‌లైన్‌లో ఇవ్వనున్నారు.

సాక్షి, తిరుమల: తిరుమల పోస్టాఫీసులోనూ శనివారం నుంచి రూ. 300ల టికెట్లను ఆన్‌లైన్‌లో ఇవ్వనున్నారు. ఒకరోజు నుంచి 30 రోజుల వ్యవధిలో రోజుకు 5వేల టికెట్లు ఇవ్వటాన్ని పోస్టల్ విభాగం గతంలో ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మొత్తం 97 కేంద్రాల ద్వారా భక్తులు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. శనివారం నుంచి తిరుమలతోపాటు నాలుగు కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఉదయం 9 గంటల నుంచి తిరుమలలోని పోస్టాఫీసులోనూ టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తిరుపతి తపాలాశాఖ సూపరింటెండెంట్ శర్మ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement