నేటి ముఖ్యాంశాలు
బాబ్రీ మసీదు
బాబ్రీ మసీదు కేసులో నేడు కోర్టులో విచారణకు హాజరుకానున్న ఎల్‌కే అద్వాణీ, మురళీ మనో హర్ జోషి, ఉమాభారతి.
జీఎస్టీ
పెంచిన జీఎస్టీ రేట్లకు వ్యతిరేకంగా ఇవాళ దక్షిణాది హోటల్స్ బంద్.
మెడికల్ షాపులు బంద్
నేడు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్. ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకం ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్న మెడికల్ షాపుల యజమానులు. క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, స్పెషాలిటీ ఆసుపత్రుల్లో దుకాణాలకు బంద్ నుంచి మినహాయింపు.
రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు రెండ్రోజులు ముందే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. బంగాళాఖాతంలో తుపాను కారణంగా వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు. మరో వారం రోజుల్లో రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం.
మెర్కెల్‌తో మోదీ భేటీ
జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో భేటీ కానున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
థాయ్‌లాండ్ ఓపెన్
నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్. బరిలోకి ఫేవరెట్లుగా సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్.
చాంపియన్స్ ట్రోఫి
ఇవాళ్టి నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ వార్మప్ మ్యాచ్.
పీజీ డెంటల్ వైద్య సీట్లు
నేడు తెలంగాణ పీజీ డెంటల్ వైద్య సీట్ల భర్తీకి తుది విడత ప్రవేశాలు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సర్టిఫికెట్ల పరిశీలన.