ఇస్తెమాకు పోటెత్తిన జనం!

Today is the mass marriages in Isthema - Sakshi

కర్నూలు(ఓల్డ్‌సిటీ):  ఏపీలోని కర్నూలు నగర శివారు నన్నూరు టోల్‌గేట్‌ వద్ద నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఇస్తెమాకు శనివారం జనం పోటెత్తారు. దేశ విదేశాల నుంచి  ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో నగరానికి చేరుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ స్థాయి ఇస్తెమాకు హాజరవుతున్న వారికి సేవలందించేందుకు స్థానిక ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. శనివారం హజ్రత్‌జీతో పాటు మౌలానా జంషేద్, మౌలానా యూసుఫ్, ముఫ్తి షాజాద్, భాయ్‌ ఇక్బాల్‌ హఫీజ్, మౌలానా ముస్తఖీమ్, మౌలానా సయీద్, మౌలానా షౌకత్‌ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇస్తెమా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతీరోజు మగ్‌రిబ్‌ నమాజ్‌ తర్వాత హజ్రత్‌జీ బయాన్‌ ఉంటుందని తెలిపారు.

నేడు సామూహిక వివాహాలు
ఆదివారం సాయంత్రం అసర్‌ నమాజు తర్వాత ఇస్తెమాయీ షాదియాన్‌ (సామూహిక వివాహాలు) నిర్వహించనున్నట్లు ఇస్తెమా కమిటీ సభ్యులు తెలిపారు. హజ్రత్‌జీ సమక్షంలో రెండు వందలకు  పైగానే నిఖాలు జరుగుతాయని తెలిపారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top